Friday, April 19, 2024
Friday, April 19, 2024

పేపర్ల లీకేజీ కేసులో కీలక నిందితురాలు రేణుకకు బెయిల్


తెలంగాణలో సంచలనం రేకెత్తించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహరంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ3 నిందితురాలిగా ఉన్న రేణుక రాథోడ్ కు బెయిల్ మంజూరు అయింది. నాంపల్లి కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. రూ. 50 వేల పూచీకత్తులు రెండు, పాస్ పోర్టు సమర్పించాలని కోర్టు సూచించింది. అదేవిధంగా ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సిట్ ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. పేపర్ల లీకేజీ కేసులో రేణుక అత్యంత కీలకంగా ఉన్నారు.

ఆమె భర్త డాక్యా నాయక్ ఏ4గా ఉన్నారు. ఈ క్రమంలో గతంలో పలుమార్లు ఆమె బెయిల్ పిటిషన్‌ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. అయితే, రేణుక అనారోగ్యం, మహిళ కావడం, కేసు కూడా చివరి దశలో ఉండటంతో ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరుఫున వాదించిన న్యాయవాది గుమ్మకొండ శ్రీనివాసరావు కోర్టును కోరారు. వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న రాజేందర్, రమేశ్ కుమార్‌లకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సిట్ ఇప్పటిదాకా 23 మందిని అరెస్టు చేసి విచారిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img