Friday, April 19, 2024
Friday, April 19, 2024

పోలీస్‌ వ్యవస్థ అప్‌డేట్‌ కావాలి : సీఎం కేసీఆర్‌

పోలీస్‌ వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో వివిధ విభాగాలను సందర్శించారు. టవర్‌లోని డీలోని మ్యూజియాన్ని పరిశీలించారు. తెలంగాణ పోలీస్‌ చరిత్ర, ప్రాశస్త్యాన్ని తెలిపేలా మ్యూజియం ఏర్పాటుచేశారు. మ్యూజియం గురించి సీఎం కేసీఆర్‌కు అదనపు సీసీ చౌహాన్‌ వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. గొప్ప పనితనాన్ని ప్రదర్శించడానికి ఒక గొప్ప వేదికను నిర్మించుకొని, ఉపయోగంలోకి తెచ్చుకున్న పోలీస్‌శాఖకు హృదయపూర్వక అభినందనలు..భవనాన్ని నిర్మించిన రోడ్లు భవనాలశాఖ మంత్రికి, ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజినీర్‌ గణపతిరెడ్డి, షాపూర్‌జీ నిర్మాణ సంస్థ, టెక్నాలజీని సమకూర్చిన కంపెనీ.. భవన నిర్మాణానికి ప్రతిచేసిన ప్రతి కార్మికుడికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా అని అన్నారు. ‘ఎంత బెటర్‌ పోలీస్‌ ఉంటే.. సమాజానికి అంత సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటది. ఇప్రూవ్‌మెంట్‌, రీఫామింగ్‌ ఎప్పుకటిప్పుడు అప్‌డేట్‌ అవసరం. ఆ పంథాలో మనం ఏంచేయాలి.. ఎలా పురోగమించాలన్నప్పుడు చాలా మంది పెద్దలు చాలా చెప్పారు. మహేందర్‌రెడ్డి ఇలాంటి ఫెసిలిటీ క్రియేట్‌ చేసినట్లయితే, దాని నిర్వహణ ఆధ్వర్యం పోలీస్‌శాఖలో ఉన్నప్పటికీ.. యావత్‌ తెలంగాణ అడ్మినిస్ట్రేషన్‌కు మూలస్తంభంగా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. నార్మల్‌ డేస్‌లో ఒక మాదిరిగా, విపత్తులు సంభవించినప్పుడు ఎమర్జెన్సీ షెల్టర్‌లాగా చాలా బాగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. దాన్ని నేను నమ్మేవాళ్లలో నేను ఒకడిని. రెండు సంవత్సరాల క్రితమే ఈ భవనం పూర్తి కావాలి. కరోనా, తదితర విపత్తులు, కొన్ని రకాల ఆటంకాలు కలిగి కొద్దిపాటి ఆలస్యంగా జరిగినప్పటికీ.. ఫైనల్‌గా అద్భుతంగా ఇవాళ భవనం నిర్మాణం కావడం సంతోషంగా ఉంది. మనుషులు గట్టిగా నిర్ణయం తీసుకుంటే సాధించకపోవడం అంటూ ఏమీ ఉండదు. అనేక మంది పోలీస్‌శాఖలో పని చేసిన వారు ముందే కూర్చొని ఉన్నారు. వారంతా అనేక చాలెంజ్స్‌ను ఫేస్‌ చేశారు. వారి కంట్రిబ్యూషన్‌ లేకపోతే మీ ఇవాళ ఇక్కడ నిల్చొని మాట్లాడే పరిస్థితి లేదు. ఎన్నో సార్లు చర్చలు జరిగినప్పుడు మేం అనుకుంటే ఉండేవాళ్లం.. ఎంత మహనీయులు మన గ్రేహౌండ్స్‌, ఎస్‌ఐబీ కనిపెట్టిన వారు, కౌంటర్‌ ఇంటిలిజెన్స్‌ కోసం బీజాలు వేసిన అధికారులు ఎంత గొప్పవారు అనుకుంటూ ఉండేవాళ్లం. ఎంత ముందుచూపుతో చెప్పారు.. వారందరికీ ధన్యవాదాలు చెప్పాలి అనుకుంటూ ఉండేవాళ్లం.. అందులో భాగస్వాములైన అందరికీ నేను సెల్యూట్‌ చేస్తున్నా’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img