Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ప్రగతి పథంలో తెలంగాణ ముందడుగు

నిజామాబాద్‌ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. భారత్‌లో అత్యధిక యువత ఉన్న.. టెక్నాలజీ విషయంలో వెనుకబడి ఉన్నామని అన్నారు. ఈ విషయంలో మన కంటే చైనా ముందు ఉందని అన్నారు. నిజామాబాద్‌లో కాకతీయ స్యాండ్‌ బాక్స్‌ ఆధ్వర్యంలో స్టార్ట్‌ప్‌ కంపెనీల ప్రతినిధులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా టెక్నాలజీ ఫర్‌ ఇంపాక్ట్‌ అండ్‌ స్కేల్‌ అనే అంశంపై ప్రసంగించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, టెక్నాలజీ వినియోగించి ప్రపంచంలో అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్‌ను నిర్మించామని అన్నారు. మిషన్‌ భగీరథ కార్యక్రమం ద్వారా లక్ష కిలోమీటర్ల పైప్‌లైన్‌ వేసి ఇంటంటికి మంచినీళ్లు ఇస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి ఫైబర్‌ కనెక్షన్‌ ఇచ్చే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఐటీ ఎగుమతులు రూ.లక్షా 18 వేల కోట్లకు పెరిగాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు సైతం ఐటీ పరిశ్రమను విస్తరించామన్నారు.రైతులకు ఉచిత విద్యుత్‌ అందించడమే కాకుండా ఇప్పటి వరకు రైతుబంధు ద్వారా రూ. 60వేల కోట్లు ఇచ్చామన్నారు. ఈ పథకం ద్వారా 60లక్షల మంది లబ్ధిపొందారని చెప్పారు. తెలంగాణ సాధించేనాటికి పంట దిగుబడి 68లక్షల టన్నుల ధాన్యం మాత్రమే ఉండేదని ఇప్పుడు 3.5కోట్ల టన్నుల ధాన్యం పండుతుందని తెలిపారు.ఆయిల్‌ ఫామ్‌ సాగుతో తెలంగాణలో రైతులకు నిత్యం ఆదాయం సమకూరుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో20లక్షల ఎకరాల్లో ఆయిల్‌ఫామ్‌ సాగు జరుగుతోందని తెలిపారు. దీనికి అనుగుణంగానే తెలంగాణలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సహకాలు ఇస్తున్నామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img