Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రజల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం

విశాలాంధ్ర, నర్సంపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకుండా నియంతృత్వ ధోరణి అవలంబిస్తూ ప్రజా స్వామిక హక్కులను కాలరాస్తున్నారని ఎంసిపిఐయు డివిజన్‌ కార్యదర్శి కన్నం వెంకన్న, ఏఐఎఫ్‌ డిడబ్ల్యు జిల్లా కార్యదర్శి వంగల రాగసుధ ఆందోళన వ్యక్తం చేశారు. భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ, ఐక్య ఆధ్వర్యంలో పేదలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి నాలుగవ రోజుకు చేరాయి. దీక్షలో కూర్చున్న వారికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను గద్దెను ఎక్కిన తర్వాత విస్మరించి తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇష్టారీతిన పాలనను కొనసాగిస్తున్నారాన్నారు. మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను కార్పొరేట్‌ పెట్టుబడిదారి శక్తులకు కట్టబెట్టేందుకు చట్టాలను రూపొందిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఉద్యమాలే శరణ్యమని అందుకే నర్సంపేటలో భూపోరాటాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉద్యమం నర్సంపేట నియోజకవర్గంలో ప్రభుత్వ హామీలు అమలయ్యేవరకూ కొనసాగుతుందని, ప్రజా సంక్షేమ కోరుకునే ప్రతి ఒక్కరూ పోరాటానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంభ బాబురావు, జిల్లా నాయకులు మహమ్మద్‌ రాజా సాహెబ్‌ ,కలకోట్ల యాదగిరి, చందు, వేణు, రాకేష్‌ తబిత, మంజుల తదితరలు దీక్షలో కూర్చున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img