Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన గవర్నర్‌ తమిళిసై

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తన ఢల్లీి పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. . తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై ఆమె రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానికి తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులను వివరించినట్లు సమాచారం.మంగళవారం నాడు రాత్రి తమిళిపై న్యూఢల్లీికి వచ్చారు. ప్రధానితో సమావేశం తర్వాత గవర్నర్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో కూడా సమావేశమవుతారని తెలుస్తోంది.. తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిపై సౌందర రాజన్‌కు ఈ మధ్య కాలంలో అగాధం పెరిగిపోతుంది. ఈ తరుణంలో ప్రధానితో తమిళిసై భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.
గవర్నర్‌ కోటాలో కౌషిక్‌ రెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం గురించి మాట్లాడుతూ.. గవర్నర్‌ కోటాలో ఆయన అర్హుడు కాదని అన్నారు. సేవా రంగంలో ఉన్నవారికి ఎమ్మెల్సీ ఇవ్వాలని అందుకే ఆ ఫైల్‌ను తిరస్కరించానని, అందులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. అంతకుముందు ఇద్దరు ఎమ్మెల్సీలకు ఆమోదముద్ర వేశానని గుర్తు చేశారు. ఎల్లప్పుడూ తాను రాజ్యంగ విలువలకు ప్రాధాన్యం ఇచ్చేలా వ్యవహరించానని, గవర్నర్‌ పదవికి, రాజ్‌ భవన్‌కు మచ్చ తెచ్చేలా ప్రవర్తించలేదని అన్నారు. తాను పారదర్శకంగా వ్యవహరిస్తానని అన్నారు. వివాదాలు, పొరపొచ్చాలు ఎన్ని ఉన్నా తాను ఎల్లప్పుడూ ప్రభుత్వంతో స్నేహంగా ఉండేందుకే ఇష్టపడతానని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img