Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ

ధాన్యం కొనుగోలుపై ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం లేఖ రాశారు. 2020-21 రబీలో మిగిలిన 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని వినతి చేశారు. 2021-22 ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేయాలని సీఎం ప్రతిపాదించారు.ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్రాల్లో గందరగోళం నెలకొందని,. రాష్ట్రాల నుంచి సేకరించే మొత్తంపై ఎఫ్‌సీఐ స్పష్టత ఇవ్వట్లేదు.. ఏటా ఉత్పత్తి పెరుగుతున్నా సేకరించే మొత్తం పెరగట్లేదు అని సీఎం లేఖలో పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి, వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది అని సీఎం పేర్కొన్నారు. 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును పూర్తి ఉచితంగా అందిస్తూ, ఏడాదికి ఎకరానికి రూ. 10,000 పంటపెట్టుబడి ప్రోత్సాహకాన్ని తెలంగాణ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. కష్టజీవి అయిన తెలంగాణ రైతు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ గుణాత్మకంగా దిగుబడిని సాధిస్తున్నాడు. తద్వారా దేశ ప్రగతికి దోహదం చేస్తున్నాడు అని లేఖలో వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img