Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రభుత్వం దిగొచ్చి ధాన్యం కొనేవరకు కొట్లాడతాం : రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో వరి దీక్ష పేరుతో కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టింది. కిసాన్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్కులో రెండ్రోజులపాటు దీక్ష కొనసాగనుంది. టీపీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, రూ.లక్ష కోట్లతో ప్రాజెక్టులు కట్టామని చెబుతున్న సీఎం కేసీఆర్‌.. రైతులు పండిరచిన ధాన్యం ఎందుకు కొనగోలు చేయడం లేదని నిలదీశారు. ధాన్య రాశుల వద్ద చనిపోయిన రైతులకు కనీసం రైతు బీమా కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చింది కాంగ్రెస్‌నే అని, రైతులు పండిరచిన పంటను కొనుగోలు చేసేందుకు ఎఫ్‌సీఐ విధానాన్ని తీసుకొచ్చి గిట్టుబాటు ధర కల్పించింది కాంగ్రెస్‌ అని పేర్కొన్నారు. అనేక పథకాలు తీసుకొచ్చిన కాంగ్రెస్‌ను సీఎం ప్రశ్నించడం దారుణమన్నారు. కేంద్రం 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెబితే, రాష్ట్ర సర్కారు ఇప్పటివరకు 8 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. ప్రభుత్వం దిగొచ్చి ధాన్యం కొనేవరకు కొట్లాడతామని పేర్కొన్నారు. వరి కొనకపోతే టీఆర్‌ఎస్‌, బీజేపీకి ఉరేనన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img