Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రభుత్వ ఉద్యోగులు జీతమో రామ‘చంద్రా’ అంటున్నారు : రేవంత్‌రెడ్డి

తెలంగాణలోని పలు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందకపోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ట్విటర్‌ లో స్పందించారు.సగం నెల కావస్తున్నా సగానికి పైగా జిల్లాల ఉద్యోగులకు జీతాల్లేవ్‌. వంతులవారిగా జీతాలివ్వడం చరిత్రలో ఎన్నడు లేదని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఉద్యోగులు జీతమో రామ‘చంద్రా’ అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రాన్ని కేసీఆర్‌ దివాళా తీయించాడని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?’ అని రేవంత్‌ ట్వీట్‌ చేశారు. పలు జిల్లాల ఉద్యోగులకు ఇంకా జీతాలు అందకపోవడంపై ఓ పత్రికలో వచ్చిన వార్తను రేవంత్‌ షేర్‌ చేశారు.రాష్ట్రంలోని 18 జిల్లాలో ఉద్యోగాలకు జీతాలు అందలేదని తెలుస్తోంది. పెన్షనర్ల పరిస్థితి కూడా అలానే ఉంది. సమయానికి జీతాలు రాకపోవడంతో ఈఎంఐలు కట్టలేకపోతున్నామని, దాంతో, చెక్‌ బౌన్సులు అవుతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌, మరో 14 జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే దశల వారీగా జీతాలు వచ్చాయని, రోజుకు మూడు, నాలుగు జిల్లాలకు ఆర్థిక శాఖ చెల్లింపులు జరుపుతోందని సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img