Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ‘ఆరోగ్య లక్ష్మి’ ఒకటి :

మంత్రి సత్యవతి
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఆరోగ్య లక్ష్మి పథకం ఒకటని, రాష్ట్రంలో గర్బిణీలు, బాలింతలు, పిల్లలకు పోషకాహారాన్ని అందించడానికి ఈ పథకాన్ని అమలుచేస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ చెప్పారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆరోగ్య లక్ష్మి పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని 2015, జనవరి 1వ తేదీన ప్రారంభించామన్నారు. గర్భిణిలకు, బాలింతలకు ప్రతి రోజు 200 ఎంఎల్‌ పాలు, ఒక కోడిగుడ్డుతో పాటు భోజనం అందిస్తున్నాం. ఏడు నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు 16 గుడ్లు(నెలకు), 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు 30 గుడ్లను(నెలకు) అంగన్‌వాడీ సెంటర్‌ నుంచి అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యలక్ష్మి పథకం కోసం 2015 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు రూ. 11 వందల 10 కోట్ల 89 లక్షలను ఖర్చు పెట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో అంగన్‌వాడీలను బలోపేతం చేశామన్నారు. అంగన్‌వాడీ టీచర్లు రూ.10,500 గౌరవ వేతనం పొందుతున్నారు. దీంట్లో కేంద్రం వాటా రూ. 2700, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.7,800 అని తెలిపారు. ఆయాలకు కేంద్ర వాటా రూ. 1350, రాష్ట్రం వాటా రూ. 4650 ఇస్తున్నాం. పీఆర్సీ అమలైతే టీచర్లకు రూ. 13 వేలకు పైగా, ఆయాలకు అదనంగా రూ. 1300 వస్తుందన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల రిక్రూట్‌మెంట్‌ కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img