Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రాజెక్టులు నీట మునగడంపై రేవంత్‌రెడ్డి ఫైర్‌

వార్తా పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్‌ను జత చేస్తూ వరుస ట్వీట్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని పంపుహౌస్‌లు నీట మునగడంపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదంటూ ఓ వార్తా పత్రికలో వచ్చిన క్లిప్పింగ్స్‌ను జత చేస్తూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.పాజెక్టుల నిర్మాణానికి లక్ష కోట్లకు పైగా వెచ్చించామని చెబుతున్న కేసీఆర్‌ ప్రభుత్వం.. వాటి నిర్వహణకు రూ.1000 కోట్లు కూడా ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ‘ఇది సింపుల్‌.. కమీషన్లు లేకపోతే కల్వకుంట్ల వారు కదలరా..?! పైసలుంటేనే ప్రగతి భవన్‌ తలుపులు తెరుచుకుంటాయా?!’ అని ప్రశ్నిస్తూ వరుసగా ట్వీట్లు చేశారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టులోని పంపుహౌజ్‌లు మునగడంపై గురువారమే ‘‘రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం (అన్నారం పంప్‌ హౌస్‌) నీళ్లలో నిండా మునిగింది. తెలంగాణ ప్రజల కష్టార్జితం కేసీఆర్‌ అవినీతికి బలైంది’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img