Friday, April 19, 2024
Friday, April 19, 2024

బడ్జెట్‌పై విమర్శలు సహజం : సీఎం కేసీఆర్‌

బడ్జెట్‌పై విమర్శలు సహజమని సీఎం కేసీఆర్‌ అన్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత అద్భుతంగా ఉందని అధికార సభ్యులు ప్రశంసిస్తారు. పసలేని, పనికిమాలిన బడ్జెట్‌ అని విపక్షాలు విమర్శిస్తాయని అన్నారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ.బడ్జెట్‌ అంటే బ్రహ్మపదార్థం అన్నట్టు, అంకెలు మాత్రమే చెప్తరు అన్నట్టు మన దేశంలో ప్రబలి ఉందన్నారు. పార్లమెంట్‌లో కానీ, వివిధ రాష్ట్రాల బడ్జెట్‌ల్లో కానీ రెండు విషయాలు గమనిస్తాం. ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెడుతారు. అద్భుతమైన బడ్జెట్‌ అని అధికార సభ్యులు, పసలేని, పనికిమాలిన బడ్జెట్‌ అని విపక్ష సభ్యులు అంటారు. ఈ అభిప్రాయంలో మార్పు లేదు. సీట్లు మారినా కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. బడ్జెట్‌ అనేది నిధుల యొక్క కూర్పు. ఈ సమకూర్చబడ్డ నిధులను ఎలా ఉపయోగించాలనేది కూడా ప్రధానం అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థ కొత్తపుంతలు తొక్కుతోంది. మొట్టమొదటి దేశ బడ్జెట్‌ 190 కోట్లు.. దాంట్లో 91 కోట్లు రక్షణ రంగానికే. ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదివేటప్పుడు చెన్నారెడ్డి బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. అప్పుడు ఏపీ బడ్జెట్‌ 680 కోట్లు. ఇప్పుడేమో లక్షల కోట్లలో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. అలా సమకూర్చుకున్న నిధులపై అభివృద్ధి ఆధారపడి ఉంటుందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img