Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బీజేపీ నేతలవి.. అబద్దాలు, అభూతకల్పనలు…

పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
బీజేపీ నాయకులు అబద్దాలు, అభూతకల్పనలు సృష్టించడం దుర్మార్గమైన చర్యగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు.సోమవారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం కావాలన్న ధ్యేయంతోనే ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఎన్‌ సిడిసి ద్వారా 3549.98 కోట్లు ఎన్‌సిడిసి రుణం తీసుకొని ఈ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో కేంద్రం వెయ్యి కోట్లు సబ్సిడీ ఇస్తామని చెప్పి ఇయ్యలేదని ఆయన ఆరోపించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎన్‌సిడిసికి 2900.74 కోట్ల రూపాయల రుణం తిరిగి చెల్లించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది. అయినా మేము ఎక్కడ చెప్పలేదని అన్నారు. ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండి ఆధారాలు లేకుండా జనం మధ్యన అబద్ధం చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. . కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్పారు. రామప్ప దేవాలయానికి యూనిస్కో గుర్తింపులో మా పాత్ర లేదని ఎలా చెబుతారు తలసాని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img