Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

బౌద్ధ వారసత్వ కేంద్రాలను అభివృద్ధికి కృషి : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బౌద్ధ వారసత్వ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్‌ ఆఫీసర్‌తో తైవాన్‌ దేశ ప్రతిష్టాత్మక మహాబోధి సొసైటీ ప్రతినిధులు శ్రమనెర, బిక్షుబుద్ధ దత్త, సాగటనందాలు ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. కృష్ణా నది ఒడ్డున ఉన్న నాగార్జున సాగర్‌ వద్ద ఉన్న 274 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ వారసత్వ కేంద్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. బుద్ధవనం అభివృద్ధిలో భాగంగా మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించి దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న బౌద్ధ వారసత్వ కేంద్రాల అభివృద్ధి, అంతర్జాతీయంగా ఉన్న పర్యాటకులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. బుద్ధవనం ప్రాజెక్టులో ప్రసిద్ధ మహాబోధి సొసైటీ ఆధ్వర్యంలో బౌద్ధఆరామాలు, ధ్యాన మందిరాల నిర్మాణం, ఆధ్యాత్మిక విద్యాకేంద్రాల ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని తైవాన్‌ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షవులు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు ప్రతిపాదనలు సమర్పించారు. ఈ ప్రతిపాదనపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సానుకూలంగా స్పందించారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించాలని బుద్ధవనం ప్రాజెక్టు అధికారులను మంత్రి ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img