Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం

భారీవర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం కొనసాగుతున్నది. గంట గంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద రికార్డు స్థాయిలో ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం నీటిమట్టం 69.70 అడుగులకు చేరింది. ఎగువ నుంచి గోదావరిలో 23.70 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం మూడో ప్రమాదకర హెచ్చరిక కొనసాగుతున్నది.1976 నుంచి గోదావరి నీటిమట్టం 60 అడుగుల మార్క్‌ను దాటడం ఇది ఎనిమిదోసారి. ఇంతకు ముందు 1986లో గోదావరి నీటిమట్టం 75.6 అడుగులకు చేరింది. భారీ వరద నేపథ్యంలో గోదావరి వద్ద వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన చరిత్రలో రాకపోకలు నిలిపివేయడం ఇది రెండోసారి. శనివారం సాయంత్రం వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ప్రస్తుతం తెలంగా నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img