Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

భద్రాద్రి జిల్లాలో సహాయ, పునరావాస చర్యలపై సీఎస్‌ సమీక్ష

భద్రాద్రి జిల్లాలో సహాయ, పునరావాస చర్యలపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి మండలానికి ఒక అధికారిని నియమించి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ప్రతి గ్రామంలో మెడికల్‌, విద్యుత్‌, శానిటేషన్‌ విభాగాల బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. ఇతర జిల్లాల పారిశుధ్య సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టామని, ప్రస్తుతం 436 వైద్య శిబిరాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆయా శిబిరాల్లో ఇప్పటి వరకు పదివేలమందికిపైగా వైద్య చికిత్సలు అందించినట్లు చెప్పారు. గర్భిణులకు పీహెచ్‌సీల్లో వైద్యం అందిస్తున్నామని, ప్రతి పునరావాస కేంద్రంలోనూ వైద్య శిబిరాల ఏర్పాటు చేసినట్లు వివరించారు. అన్ని గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు వివరించారు. సమీక్షలో కలెక్టర్‌, ఇతర సీనియర్‌ అధికారులతో సీఎస్‌ సమావేశమయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img