Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

భారీ ఎత్తున చేపల పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహం

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
రాష్ట్రంలో భారీ ఎత్తున చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చేపల పెంపకానికి ప్రోత్సాహంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2021-22 ఏడాదికి 28,704 నీటి వనరులలో 93 కోట్ల చేప పిల్లలను, ఎంపిక చేసిన 200 నీటి వనరుల్లో 10 కోట్ల రొయ్య పిల్లలను నిల్వ చేయాలని ప్రతిపాదించాం. 81 రిజర్వాయర్లు, 1348 శాశ్వత చెరువులు, 27,275 వానాకాలం చెరువుల్లో చేపలను వదులుతున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివిధ వర్గాలను ఆదుకునేందుకు ఉపాధి కల్పించడంలో భాగంగా మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img