Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మంత్రి హరీష్‌ రావుకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వినతి..

అసెంబ్లీలో మంత్రి హరీష్‌ రావుని తన ఛాంబర్‌ లో ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఫండ్స్‌ ఇవ్వాలని కోరారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ స్కీమ్‌ కింద రూ.5 కోట్ల 50 లక్షల ఫండ్స్‌ ఇవ్వాలని కోరడం జరిగింది. సంగారెడ్డి పట్టణంలోని ఫాతే ఖాన్‌ దర్గా అభివృద్ధి కోసం రూ.3 కోట్లు ఇవ్వాలని కోరారు. సంగారెడ్డి పట్టణంలోని ఈద్‌ గా అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 కోట్లు ఇవ్వాలన్నారు. సంగారెడ్డి పట్టణంలోని దీన్‌ దార్‌ ఖాన్‌ ఫంక్షన్‌ హాల్‌ అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించాలని కోరారు. సంగారెడ్డి పట్టణంలోనే ముస్లింల ఖాభారస్థాన్‌ (స్మశానవటిక ) కొరకు 5 ఎకరాల భూమి కావాలని, ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరగా భూమి కేటాయించాలన్నారు. సంగారెడ్డి పట్టణంలో హిందువుల స్మశానవటికకు 5 ఎకరాల భూమి కావాలని, ఇది కూడా సర్కార్‌ వెంటనే పరిశీలించి మంజురు చేయాలన్నారు. ఇక క్రిస్టియన్స్‌ కోసం కూడా సంగారెడ్డి పట్టణంలో 5 ఎకరాల భూమి క్రిస్టియన్స్‌ గ్రేవ్‌ యార్డ్‌ (స్మశానవటిక ) కేటాయించాలని ప్రభుత్వని కోరుతున్న అన్నారు. సదశివాపేట్‌ లో మెహబూబ్‌ పాషా దర్గా అభివృద్ధి కోసం రూ.3 కోట్లు మంజూరు చేయాలన్నారు. అలాగే సదశివాపేట్‌ లో ముస్లిం ఈద్‌ గా అభివృద్ధికి రూ.3 కోట్లు కేటాయించాలన్నారు. సంగారెడ్డి పట్టణంలో ఉన్న సీఎస్‌ఐ చర్చి ఉంది ఇది ఎంతో చరిత్ర కలిగిన చర్చి ఈ చర్చ్‌ అభివృద్ధికి ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించాలని కోరారు. సంగారెడ్డి పట్టణంలో శివాలయం నిర్మించడం జరుగుతుంది, అతి పెద్ద శివలింగం కైలాస ప్రస్తారా శ్రీ చక్రలో శివలింగం ఏర్పాటు చేయబోతున్నారు%ౌౌ% దీనికోసం ప్రభుత్వం రూ.18 కోట్లు కేటాయించాలన్నారు. అలాగే సంగారెడ్డి పట్టణంలో వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం రూ.18 కోట్లు కేటాయించాలన్నారు. సంగారెడ్డి జిల్లా హెడ్‌ క్వాటర్‌ లో ఆర్యవైశ్య జిల్లా సంఘం భవనం కోసం 2 ఎకరాల భూమి, రూ.3 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరడం జరిగింది. జగ్గారెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యాక్షుడు తోపాజి అనంత కిషన్‌ గుప్తా, జిల్లా యువజన సంఘాం అధ్యక్షుడు తోపాజి హరీష్‌ గుప్తా కలిసి ఆర్యవైశ్య భవనం కోసం వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img