Friday, April 19, 2024
Friday, April 19, 2024

మన ఊరు-మన బడి కార్యక్రమం సీఎం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం

మంత్రి హరీశ్‌రావు
సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో రాష్టంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ పాఠశాలలుగా మారనున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.జిల్లా లోని పోతిరెడ్డిపల్లిలో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని మంత్రి హరీశ్‌రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మన ఊరు-మన బడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.7300 నిధులు కేటాయించిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి రాష్ట్రంలోని పాఠశాలలకు కేటాయించిన నిధులు ఇప్పుడు ఒక్క ఉమ్మడి జిల్లాకు కేటాయించామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం బోధన ప్రారంభం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లీష్‌ రెండు భాషల్లో పుస్తకాల ముద్రణ ప్రారంభమైంది. విద్యార్థుల సౌలభ్యం కోసం ఒకే పాఠం తెలుగు,ఇంగ్లీష్‌ లో ముద్రిస్తామన్నారు. రూ.100 కోట్లతో పాఠశాలలు, కాలేజీల్లో చదువుకునే ఆడపిల్లలకు హైజీనిక్‌ కిట్స్‌ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, జెడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img