ఈ 8 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
నేటి నుంచి మరో 5 రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడిరచారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ట్విటర్ ద్వారా ఈ వివరాలు వెల్లడిరచారు. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడిరచారు.పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని అంచనా వేశారు. అంతేకాక, జూన్ 14వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీస్తాయని అంచనా వేశారు.ఇక ఈ వానాకాలం మొదలయ్యాక తెలంగాణ అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాల్లో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 135.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. తర్వాత నిజామాబాద్ లో 128.2 మి.మీ., జగిత్యాలలో 126.6 మి.మీ., పెద్దపల్లిలో 112.7 మి.మీ., కరీంనగర్లో 100.1 మి.మీ వర్షం కురిసినట్లుగా అధికారులు ప్రకటించారు.