Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మహిళలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది : కాంగ్రెస్‌

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు తీవ్ర అన్యాయం చేసిందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే సెర్ప్‌ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం నాడు ఇందిరభన్లో తెలంగాణ మహిళ కాంగ్రెస్‌ విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మహిళ కాంగ్రెస్‌ జాతీయ ఇంచార్జి ఫాతిమా రోసనా హాజరవ్వగా, తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతా రావ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభయ హస్తంలో పెన్షన్‌ ఇవ్వక పోగా మహిళలు కట్టిన రూ.1250 కోట్లు వెనక్కి ఇవ్వడం లేదన్నారు. మహిళా సంఘాల సభ్యులు చనిపోతే రూ.25 వేలు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చేదని, ఇప్పుడు రూపాయి కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. మహిళా సాధికారతకి కాంగ్రెస్‌ పెద్ద పీట వేసిందని, ఇలా టీఆర్‌ఎస్‌ మహిళలను చీట్‌ చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిందని, కానీ కేసీఆర్‌ సీఎం అయ్యాక వడ్డీ లేని రుణం పరిమితి రూ.10 లక్షలకు పెంచుతా అని చెప్పి ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం ఇవ్వలేదన్నారు. రూ.3000 కోట్లు మహిళా సంఘాలకు ఈ ప్రభుత్వం బకాయి పడిరదని ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌లో ఎన్నికలు ఉన్నాయని రూ.50 కోట్లు విడుదల చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం వడ్డీలు ఇవ్వకపోగా మహిళల నుండి వడ్డీలు వసూలు చేయాల ఈ ప్రభుత్వం ఒత్తిడి పెంచుతుందన్నారు. చివరకు మహిళలు వడ్డీలు చెలించకపోతే చెల్లించని చోట అధికారులను సస్పెండ్‌ చేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారడం దారుణమన్నారు. మహిళ కాంగ్రెస్‌ ఎలాంటి కార్యక్రమం తీసుకున్న మీ అడుగులో అడుగు వేసి సహకరిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో మహిళా అధ్యక్షులకు, నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది జరిగిన నాకు, మహేష్‌ గౌడ్‌కి ఒక పేపర్‌లో రాసి ఇవ్వండి మేము చూసుకుంటామని జగ్గారెడ్డి అన్నారు. ఢల్లీిలో మహిళ కాంగ్రెస్‌ కార్యక్రమానికి వెళ్ళే వారి ట్రైన్‌ టికెట్‌ ఖర్చులు నేను చూసుకుంటా అని స్పష్టం చేశారు. మహిళ డ్వాక్రా గ్రూప్‌ లను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, ఈ అంశం పై మహిళ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలు చేయాలని సూచించారు. అలాగే నిత్యం గ్యాస్‌, పెట్రోల్‌ ,డీజీల్‌ ధరలు పెరుగుతున్నాయని, దీని ప్రభావం ఎలా ఉటుందో మీకు తెలుసన్నారు. డబ్బు విలువ ఎక్కువ మహిళలకే తెలుసు కావున తెలంగాణ లో ఉన్న 33 జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. 33 జిల్లాల పర్యటన తర్వాత ఒకలక్ష(1 లక్ష ) మంది మహిళలలో సభ నిర్వహించండి దీనికి నా పూర్తి సహకారం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో నిర్వహించాలని కోరారు. మహిళ విభాగానికి ఇన్‌ ఛార్జ్‌గా నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img