Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ : మంత్రి హరీష్‌ రావు

మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్దిపేట హౌసింగ్‌ బోర్డు సర్కిల్‌ లో చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకుని చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి తన్నీరు హరీష్‌ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. జోహార్‌ చాకలి ఐలమ్మ అంటూ నినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారన్నారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వకారణం అన్నారు. అన్నీ ప్రభుత్వ కార్యాలయాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నాం అన్నారు. రానున్న రోజుల్లో ఐలమ్మ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేస్తాం అన్నారు. కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం కేసిఆర్‌ కృషి చేస్తున్నారు.. సిద్దిపేటలో అన్ని సౌకర్యాలతో మోడరన్‌ దోబి ఘాట్‌ రజకుల సౌకర్యార్థం నిర్మించాం అన్నారు. రానున్న రోజుల్లో ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేస్తాం అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img