Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మహిళా దినోత్సవం..టీఎస్‌ఆర్టీసీ ఉచిత ప్రయాణం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ఇవాళ మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏళ్లకు పైబడిన మహిళలకు ఈరోజు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడిరచారు. ఈ అవకాశం ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో మహిళా ప్రయాణికుల కోసం రద్దీ ఆధారంగా ప్రత్యేకంగా ట్రిప్పులు నడుపుతామన్నారు.మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్‌స్టాప్‌లలో మహిళా వ్యాపారులకు ఉన్న స్టాళ్లకు సంబంధించి ఈ నెల 31 వరకు ఎలాంటి ఛార్జీలు తీసుకోమని ప్రకటించారు. పూర్తిగా ఉచితంగా ఈ నెల 31 వరకు స్టాళ్లను కేటాయిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img