Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మహిళా పారిశ్రామిక వేత్తలకు తోడ్పాటునందిస్తాం : మంత్రి కేటీఆర్‌

మహిళా పారిశ్రామిక వేత్తలకు తోడ్పాటునందిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సుల్తాన్‌పూర్‌లో మహిళా పారిశ్రామిక పార్కును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేసిన ఫ్లో ఇండస్ట్రియల్‌ పార్క్‌ పైలాన్‌ను కేటీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు. రాష్ట్రంలోని మహిళా పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తామని, వారు ఎదగడానికి సహకారం అందిస్తామని ప్రకటించారు. దేశంలో తొలిసారి మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఉద్యామిక అనే కొత్త కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటైన ఏకైక కేంద్రం వీ హబ్‌ అని కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటైన వీ హబ్‌కు సీఈవోగా దీప్తి ఉన్నారు. వీ హబ్‌ సందర్శించి మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతి ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 18 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్నారు. ప్రయివేటు రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగ కల్పన కల్పించామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img