Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మహిళా సాధికారతతోనే దేశ సమగ్ర వికాసం

: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
దేశ సమగ్ర వికాసానికి మహిళా సాధికారత అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఏకలవ్య ఆదర్శ పాఠశాలల ద్వారా గిరిజనులకు నాణ్యమైన విద్య అందుతున్నదని చెప్పారు. భద్రాచలం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సమ్మక్క, సారలమ్మ గిరిజన పూజారుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలలను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో తన పర్యటన తీపి జ్ఞాపకంగా మిగులుతుందన్నారు. భద్రాద్రి రాముడి దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి వ్యాఖ్యలను రాష్ట్రపతి ప్రస్తావించారు.రామాయణంలో భద్రాచలానికి ప్రత్యేక అనుబంధం ఉందని రాష్ట్రపతి చెప్పారు. సీతారాములు, లక్ష్మణుడు ఇక్కడ కొంతకాలం గడిపారని తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రాలకు వచ్చేవారి సంఖ్య బాగా పెరుగుతున్నదని వెల్లడిరచారు. ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి పర్యాటకశాఖ దృష్టి సారించిందన్నారు. గిరిజనుల అభివృద్ధికి వనవాసి కల్యాణ పరిషత్‌ ఎంతో కృషి చేస్తున్నదని తెలిపారు.
గిరిజన బిడ్డ రాష్ట్రపతి కావడం గర్వకారణం: మంత్రి సత్యవతి
గిరిజన బిడ్డ రాష్ట్రపతి కావడం మనకు గర్వకారణమని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు హర్షణీయమని చెప్పారు. గురుకుల స్కూళ్ల ద్వరా పిల్లలకు నాణ్యమైన విద్య అందుతున్నదని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img