Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మార్చి 9 కూడా చరిత్రాత్మకంగా మిగిలిపోతుంది : ఎమ్మెల్సీ కవిత

నిరుద్యోగులకు శుభవార్తను అందిస్తూ సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.తాజాగా ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ, డిసెంబర్‌ 9 తెలంగాణ సాధన దినంగా ఎలా మిగిలిపోతుందో.. అలాగే మార్చి 9 కూడా చరిత్రాత్మకంగా మిగిలిపోతుందని చెప్పారు.రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించుకుని 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా తాము చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర యువత ప్రయోజనాలను పరిరక్షించుకోవడం జరిగింది కాబట్టి ఈ అంశం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.ఇప్పటికే 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చామని, ప్రైవేట్‌ రంగంలో కూడా ఉద్యోగాల కల్పనకు కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. కేంద్రంలో ప్రధాని మోదీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ భర్తీ చేయలేదని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img