Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మాస్క్‌ ధరించకపోతే రూ. 1,000 జరిమానా

డీహెచ్‌ శ్రీనివాసరావు
కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై ఆందోళన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కొవిడ్‌ కట్టడి చర్యలపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు మార్గనిర్ధేశం చేస్తున్నట్టు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని వెల్లడిరచారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. ఒమిక్రన్‌ ఇప్పటికే వ్యాప్తి ఎక్కువగా ఉందని.. ఇప్పటికే 25 దేశాలు నుంచి కేసులు వస్తున్నాయని వెల్లడిరచారు. గడప దాటి అడుగు బయటపెడితే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ధ్రువీకరణ పత్రం ఉండాలని, అలాగే ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ లేకుండా జనాలు తిరిగితే వారికి రూ. 1000 జరిమానా విధిస్తామని డీహెచ్‌ హెచ్చరించారు. డెల్టా రకం కంటే ఒమిక్రాన్‌ ఆరు రెట్లు ఎక్కువగా వ్యాపిస్తోందన్నారు. కేవలం మూడు రోజుల్లోనే 24 దేశాలకు విస్తరించిందని గుర్తుచేశారు. వైరస్‌ ముప్పు నుంచి మనం బయటపడేందుకు మన చేతిలో ఉన్న ఆయుధాలు కేవలం వ్యాక్సిన్‌, మాస్క్‌లేనన్నారు. అన్ని రకాల పని ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఈరోజు నుంచి వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ని కూడా అధికారులు వెరిఫై చేస్తారని తెలిపారు. మాస్క్‌ ధరించకపోతే రూ.1000 జరిమానా విధించనున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img