Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మూసీ ఉధృతి.. మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత

భారీవర్షాలు పడుతుండటంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంటజలాశయాలతోపాటు గండిపేట చెరువు గేట్లు ఎత్తివేయడంతో నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో మూసారాంబాగ్‌ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వంతెనకు రెండు వైపుల బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో అంబర్‌పేట-మలక్‌పేట మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.మూసీ ఉగ్రరూపం దాల్చడంతో మూసానగర్‌, కమలానగర్‌ను వరద చుట్టిముట్టింది. దీంతో మూసారాంబాగ్‌ లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీచేయించారు. రత్నానగర్‌, పటేల్‌నగర్‌ గోల్నాకలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించారు. ఇక వరదల కారణంగా చాదర్‌ఘాట్‌ బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. కాగా, రెండు బ్రిడ్జిల మూసివేతతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ట్రాఫిక్‌ జాంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img