వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఆరు గేట్లు 8 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 34,400 క్యూసెక్కులు ఉంది. అవుట్ ఫ్లో 34,500 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ 3.98 టీఎంసీలుగా నమోదయ్యింది.