Friday, April 26, 2024
Friday, April 26, 2024

మేఘా సంస్థ కాంట్రాక్టులు రద్దు చెయ్యాలి .. సీబీఐతో ఎంక్వైరీ చేయించాలి

పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనుల్లో క్రేన్‌ వైరు తెగి పడి ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిన ఘటనపై వైయస్‌ షర్మిల స్పందించారు. పంప్‌ హౌస్‌ లోకి వెళుతున్న క్రమంలో క్రేన్‌ వైరు తెగి పడడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. అయితే దీని పై మండిపడిన వైయస్‌ షర్మిల సేఫ్టీ పాటించకుండా ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది మేఘా కంపెనీ అంటూ నిప్పులు చెరిగారు. ఈ చావుల బాధ్యత ఎవరిది? ఈప్రాణాల ఖరీదు ఎంత? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్ని చావులను నోట్ల కట్టల కింద దాచిపెట్టారు? బయటకు రాని లోకానికి తెల్వని వార్తలెన్ని? అంటూ వైఎస్‌ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను టార్గెట్‌ చేశారు. దొరగారు అణిచిపెడుతున్న అక్రమాల ఆర్తనాదాలు ఎన్ని? చెప్పాలని వైయస్‌ షర్మిల ప్రశ్నించారు.ఇదే సమయంలో సదరు సంస్థ కాంట్రాక్టులను రద్దు చేయాలని వైయస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. మేఘా సంస్థ పై సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలని వైయస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ఐదుగురి ప్రాణాలు పోవడానికి కారణమై, జనం సొమ్ము దోచుకుంటున్న సంస్థకు బుద్ధి చెప్పాలన్నారు. రక్షణ చర్యలు పాటించకుండా, నాసిరకం పనులు చేస్తూ, అడిగేవాడు ఉండకూడదని అడ్డగోలుగా లంచాలు ఎర వేస్తూ ప్రజల ప్రాణాలతో మేఘ కంపెనీ చెలగాటమాడుతోందని మండిపడ్డారు. తక్షణం కంపెనీ కాంట్రాక్టులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img