Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మొబైల్‌ ఫోన్లు చోరీకి గురైతే మీసేవలో ఫిర్యాదు చేయాలి


హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌

మొబైల్‌ ఫోన్లు అపహరణకు గురైన వారు మీ సేవ, హాక్‌ ఐ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ మంగళవారం వెల్లడిరచారు.ఆయా స్టేషన్ల పరిధిలో ఫోన్లు రికవరీ అయిన అనంతరం బాధితులకు సమాచారం అందిస్తామని తెలిపారు. నగరంలోని పాతబస్తీ పరిధిలో చోరీకి గురైన 66 మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకోగా..వాటిని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొబైల్‌ ఫోన్లు చోరీకి గురైన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మొబైల్‌ ఫోన్లు చోరీకి గురైతే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. ధ్రువీకరణపత్రాలు కొల్పోయిన మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img