Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మోదీజీ..ఆ విషయంలో జోక్యం చేసుకోండి

  • కేటీఆర్‌ ట్వీట్‌
    రోజూ ఏదో ఒక అంశంపై ప్రధాని మోదీ లక్ష్యంగా మంత్రి కేటీఆర్‌ ట్వీట్లు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా నేడు కూడా మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. పంద్రాగస్టు రోజున జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ఎర్రకోటపై ప్రసంగిస్తూ మహిళల గౌరవం గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
    స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై ప్రసంగిస్తూ మహిళల గౌరవం గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. మన దేశ అభివృద్ధికి మహిళలను గౌరవించడం ఎంతో అవసరమని మోదీ పిలుపునిచ్చారు. అయితే, ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని కేటీఆర్‌ కొన్ని ప్రశ్నలు వేశారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.
    దేశ మహిళలను గౌరవించాలని మీరు మాట్లాడిన మాటల్లో నిజం ఉంటే, గుజరాత్‌ లో రిలీజైన 11 మంది రేపిస్టుల అంశంలో జోక్యం చేసుకోవాలని, ఆ ఆదేశాలను రద్దు చేయాలని ప్రధాని మోదీని మంత్రి కేటీఆర్‌ కోరారు. రేపిస్టులను రిలీజ్‌ చేయరాదు అని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఉన్నా.. గుజరాత్‌ ప్రభుత్వం రేపిస్టులను రిలీజ్‌ చేసిన ఘటన వికారంగా ఉందన్నారు. దేశ ప్రజల పట్ల సరైన రీతిలో వ్యవహరించాలని ప్రధాని మోదీని కోరారు.రేపిస్టులకు కఠిన శిక్షను అమలు చేయాలని, ఆ దిశగా ఐపీసీ చట్టాలను సవరించాలని, రేపిస్టులకు బెయిల్‌ ఇవ్వకుండా చట్ట సవరణలు చేయాలని ప్రధాని మోదీని మంత్రి కోరారు. బలమైన చట్టాలు ఉంటేనే న్యాయవ్యవస్థ త్వరితగతిని తీర్పులను ఇవ్వగలదని, అత్యుత్తమంగా న్యాయవ్యవస్థ రాణించగలదని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.2002లో గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానో అనే మహిళపై గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. అయిదు నెలల ప్రెగ్నెంట్‌ మహిళను దాహోద్‌ జిల్లాలో అత్యాచారం చేశారు. ఆమె కుటుంబానికి చెందిన ఏడు మందిని హతమార్చారు. ఆ ఘటనలో 11 మందికి 14 ఏళ్ల జైలుశిక్ష పడిరది. అయితే 75వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఆ రేపిస్టులను రిలీజ్‌ చేయడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img