Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

‘మోదీ నో ఎంట్రీ టూ తెలంగాణ’.. హైదరాబాద్‌లో ఫ్లెక్సీ కలకలం

నవంబర్‌ 12వ తేదీన తెలంగాణకు రానున్న మోదీ.. రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను జాతికి అంకితం చేయనున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. నవంబర్‌ 12వ తేదీన తెలంగాణకు రానున్న మోదీ.. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను జాతికి అంకితం చేయనున్నారు. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. మోదీ పర్యటన వ్యతిరేకిస్తూ కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘మోదీ నో ఎంట్రీ టూ తెలంగాణ’ అంటూ జూబ్లీహిల్స్‌ చౌరస్తాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని ఎత్తివేయాలని ఫ్లెక్సీల్లో డిమాండ్‌ చేసారు. ఈ ఫ్లెక్సీలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా.. రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను జాతికి అంకితం చేసిన అనంతరం ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు. గతంలో మూతబడిన రామగుండం ఎఫ్‌సీఐ (ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) పునరుద్ధరణకు కేంద్రం చర్యలు తీసుకుంది. రూ. 6,120 కోట్లతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసింది. కాగా.. గతేడాది మార్చి 22న ఆర్‌ఎఫ్‌సీఎల్‌ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించినట్టుగా ప్రకటించింది. ఇప్పుడు నరేంద్ర మోదీ అధికారికంగా జాతికి అంకితం చేయనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img