Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

యాదాద్రిలో వైటీడీఏ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

యాదాద్రి కొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో వైటీడీఏ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష జరిపారు. కొండ కింద కొనసాగుతున్న సత్యనారాయణ వ్రత మండపం, బస్‌ స్టేషన్‌, గండి చెరువు ఆధునీకరణ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు జగదీష్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌ రావు, విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్‌ రెడ్డి, చిలుమర్తి లింగయ్య, సుధీర్‌ రెడ్డి, జీవన్‌ రెడ్డి, ఈవో గీతారెడ్డి ఉన్నారు.కాగా, సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటన దృష్ట్యా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. భద్రతా కారణాలతో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. సీఎం కేసీఆర్‌ రోడ్డుమార్గంలో యాదగిరిగుట్టకు వెళ్తుండటంతో ఎన్‌ఆర్‌జీఐ మెట్రోస్టేషన్‌, ఉప్పల్‌ ఎక్స్‌రోడ్‌, బోడుప్పల్‌, మెక్‌డొనాల్డ్స్‌, ఘట్‌కేసర్‌, బీబీనగర్‌, యాదాద్రి వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img