Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు

ప్రివిలైజ్‌ నోటీసుపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని డిమాండు చేస్తూ లోక్‌సభ నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీలు వాకౌట్‌ చేశారు. ఇవాళ సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే.. టీఆర్‌ఎస్‌ ఎంపీలు వెల్‌లోకి దూసుకువెళ్లి నిరసన తెలిపారు. ప్రధానిపై ఇచ్చిన ప్రివిలేజ్‌ మోషన్‌పై నిర్ణయం తీసుకోవాలని ఎంపీ కేశవరావు డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌ను కోరారు. ఆ సందర్భంలో ఆయన స్పందిస్తూ.. సభా హక్కుల నోటీసు అందిందని, రాజ్యసభ చైర్మెన్‌ పరిశీలన కోసం ప్రివిలేజ్‌ నోటీసును పంపినట్లు ఆయన చెప్పారు. దానిపై చైర్మెన్‌ వెంకయ్యనాయుడు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలు కూడా టీఆర్‌ఎస్‌ వాదనతో సంఫీుభావం తెలిపాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే కూడా టీఆర్‌ఎస్‌ కు మద్దతు పలికారు. ప్రివిలేజ్‌ నోటీసుపై ఛైర్మన్‌ నిర్ణయం తీసుకునే వరకు సభకు వెళ్లరాదని టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిర్ణయం తీసుకున్నట్లు టీఆర్‌ఎస్‌ రాజ్యసభ పక్ష నేత కే.కేశవరావు తెలిపారు. ఈ క్రమంలోనే సభనుండి వాకౌట్‌ చేశామన్నారు. అటు లోక్‌సభలోనూ స్పీకర్‌కు ప్రివిలేజ్‌ నోటిసును అందయనున్నట్టు ఆయన తెలిపారు. సాయంత్రం స్పీకర్‌కు అందించనున్నటు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img