Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు

రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిరచారు. సాధారణ వర్షపాతం కంటే 60 శాతం అధికంగా ఈ ఐదు జిల్లాల్లో నమోదైంది. 21 జిల్లాల్లో అధిక వర్షపాతం (20 నుంచి 50 శాతం మధ్యలో) నమోదు కాగా, ఏడు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అన్ని జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. జూన్‌ 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 12వ తేదీ వరకు 873.9 మి.మీ. వర్షపాతం (సాధారణ వర్షపాతం 650.9 మి.మీ.) నమోదైంది. గత సంవత్సరం ఇదే సమయానికి 863.9 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img