Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయగలిగాం

: మంత్రి కేటీఆర్‌
రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయగలిగామని, ప్రస్తుతం వందల్లో మాత్రమే కేసులు నమోదు అవుతున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సనత్‌నగర్‌ సెయింట్‌ థెరిస్సా హాస్పిటల్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్‌తో పాటు ఏడు అంబులెన్స్‌లను మంత్రి కేటీఆర్‌ సోమవారం ఉదయం ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. ఆక్సిజన్‌ ప్లాంట్‌, అంబులెన్స్‌లను మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌ విరాళంగా ఇచ్చింది. దీనిపై మంత్రి స్పందిస్తూ, ఇవాళ ఏడు అంబులెన్స్‌లు, రూ. కోటి విలువైన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. మహీంద్రా గ్రూప్‌ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషమని చెప్పారు.భవిష్యత్‌లో మహీంద్రా గ్రూప్‌ మరిన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img