Friday, April 19, 2024
Friday, April 19, 2024

రాష్ట్రంలో తాజా పరిస్థితులపై గవర్నర్‌కు నివేదిక ఇచ్చాం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో తాజా పరిస్థితులపై గవర్నర్‌కు నివేదిక ఇచ్చామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. రైతుల గుండెలు ఆగిపోతుంటే కేసిఆర్‌ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గవర్నర్‌ తమిళిసైతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశం ముగిసింది. ఈ సందర్బంగా మీడియాతో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు తెరవడం ఆలస్యం వల్ల 30 శాతం పంట దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయిందన్నారు. మిల్లర్ల దగ్గర ధాన్యం సేకరణ వివరాలు ఉన్నాయని, వాళ్లకు బోనస్‌ ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. 8 లక్షల 34 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం మాయం అయ్యాయని, రూ. 2వేల 6 వందల కోట్ల విలువైన బియ్యం మాయంపై సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్‌ డిమాండ్‌ చేస్తున్నామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే గల్లీలో ఒకరు.. ఢల్లీిలో ఒకరు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఒడ్లు కొనాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని, ఏదో పాకిస్తాన్‌ ప్రధాని కొనాలి అన్నట్లు ధర్నాలు ఎందుకని ప్రశ్నించారు. రైతుల చావుకు కారణమైన టీఆర్‌ఎస్‌, బీజేపీని రైతులు ఉరేస్తారని రేవంత్‌ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img