Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాష్ట్రంలో ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన పరీక్షలు 12.30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. మొదటి రోజుకావడంతో పరీక్ష సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను నిర్వాహకులు అనుమతించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో 76.5 శాతం మంది ఇంగ్లిష్‌ మీడియం వారే కావడం విశేషం. తెలుగు, ఇంగ్లిష్‌తోపాటు ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ మీడియం విద్యార్థులు కూడా పరీక్షలు రాస్తున్నారు. వీరికోసం అధికారులు 2,652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిఘా కోసం 144 ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం 34,500 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. ఈ సారి ఆరు పేపర్లతోనే పది పరీక్షలను నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img