రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇక , రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గింది. ఆదివారం హైదరాబాద్లో 17.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత(సాధారణం కంటే 2.3 డిగ్రీలు ఎక్కువ) నమోదైంది. ఆదిలాబాద్లో 12.7 డిగ్రీలు, మెదక్లో 13.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యధికంగా 20 డిగ్రీలకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయి.