Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాష్ట్రంలో రెండు రోజులపాటు పలుచోట్ల మోస్తరు వర్షాలు

తెలంగాణలో రెండు రోజులపాటు పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఉందని, సముద్రమట్టానికి సమారు. 0.9కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో గురు, శుక్రవారాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపునకు వస్తున్న గాలులు వస్తున్నాయని తెలిపింది. రాష్ట్రంలో శనివారం పొడివాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img