Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది : కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని.. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా కల్పిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగా మండలం కన్హా శాంతివనంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సును కేటీఆర్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంపై అవగాహన, నైతిక విలువలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లక్ష్యాలు నిర్దేశించుకుని యువత ముందుకు సాగాలని, వారిని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల కల్పనకు హైదరాబాద్‌ పెట్టింది పేరని కేటీఆర్‌ అన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పురోగతి సాధించిందని చెప్పారు. తెలంగాణలో సెల్ఫ్‌ ఇండస్ట్రీస్‌ సర్టిఫికెట్‌ విధానం అమల్లోకి తీసుకొస్తామన్నారు. కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నామని కేటీఆర్‌ వివరించారు.మూడు రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ యువజన సదస్సుకు రామచంద్ర మిషన్‌ గ్లోబల్‌ గురు కమలేశ్‌ డి.పటేల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యునెస్కో ఎంజీఐఈపీ డైరెక్టర్‌ డాక్టర్‌ అనంత దురైయప్ప, ఏఆర్‌ రెహమాన్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌, గాయకురాలు ఖతీజా రెహమాన్‌ పాల్గొన్నారు. కన్హా శాంతి వనం సేవలు తెలంగాణకు చాలా అవసరమని కేటీఆర్‌ పేర్కొన్నారు. కోవిడ్‌ 19 సమయంలో రామచంద్ర మిషన్‌, కన్హా శాంతి వనం నేతృత్వంలో చేసిన సేవలను కొనియాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img