Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకటవుతుందన్నారు..

ఇప్పుడు ఏపీ చీకటైంది: హరీష్‌రావు
రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకటి అవుతుందని మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారని, ఇప్పుడు ఏపీ చీకటైందని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. తెలంగాణలో 24 గంటల కరెంట్‌ వస్తోందన్నారు. పామాయిల్‌ సాగుకు ఎకరానికి రూ.80 వేల సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. పామాయిల్‌ సాగుతో ఏటా ఎకరానికి రూ.లక్షా 50 వేల ఆదాయం లభిస్తోందన్నారు. మన దేశంలో నూనె వినియోగం ఎక్కువని.. ఉత్పత్రి తక్కువగా ఉందన్నారు. బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని కేంద్రం అంటోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అనేది ఒక చరిత్ర అని.. ఇక దానికి భవిష్యత్‌ లేదని హరీష్‌రావు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img