Friday, April 19, 2024
Friday, April 19, 2024

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వానలు.. మరో మూడు రోజులు భారీ వర్షం

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కూడా వర్షాలు భారీగా కురుస్తుండడంతో వరద పొటెత్తుతోంది. దీంతో తెలంగాణకు భారీగా వరద నీరు వస్తుంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణలోని యాదాద్రి, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌, సూర్యాపేట, జనగాం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఈ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో కిన్నెరసాని ప్రాజెక్టులోకి పెద్దఎత్తున వరద వచ్చిచేరుకున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి నీటిని వదిలేస్తున్నారు. ప్రాజెక్టులోకి ప్రతస్తుతం 36 వేల క్కుసెక్కుల నీరు వస్తుండగా, 56 వేల క్కుసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది.జయశంకర్‌ జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గవ్యాప్తంగా వర్షం కురుస్తున్నది. వర్షంతో భూపాలపల్లి కాకతీయ ఉపరితల గనుల్లో బోగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిరది. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం నుంచి ఎడతెరపిలేకుండా వాన కురుస్తున్నది. భారీ వర్షానికి సంగం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో కోడూరు, సూర్యాపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తున్నది. బంజారాహిల్స్‌, అమీర్‌పేట్‌, నాంపల్లి, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంటల్లో చిరుజల్లులు పడుతుండగా.. ఎల్బీనగర్‌, నాగోల్‌, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్‌, పెద్దఅంబర్‌పేట, తుర్కయంజాల్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తున్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img