రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ అధికారులు. సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు మొదటి డైరెక్టర్గా లక్ష్మీ నారాయణ పనిచేశారు. గత ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా యువతకు ట్రైనింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో ట్రైనింగ్ సెంటర్లలో అవినీతి జరిగిందంటూ ఈరోజు హైదరాబాద్లోని లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలకు వచ్చారు. నోటీస్ ఇవ్వకుండా సెర్చ్ ఎలా చేస్తారని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. దీంతో ఆయనతో పోలీసులు వాగ్వాదానికి దిగారు.