Friday, April 19, 2024
Friday, April 19, 2024

రెండో రోజు బండి సంజయ్‌కి నిరసన సెగ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి జిల్లా పర్యటనలో అడుగడుగునా నిరసన సెగలు తగులుతున్నాయి. బండి సంజయ్‌ పర్యటనను టీఆర్‌ఎస్‌ శ్రేణులు మరోసారి అడ్డుకునేందకు యత్నించాయి. సూర్యాపేట జిల్లా అర్వపల్లి సెంటర్‌లో ఇవాళ ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ శ్రేణులపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. కర్రలతో దాడికి యత్నించారు. దీంతో ఇరువర్గాలను చెదరగొట్టెందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. చివ్వెంల మండల కేంద్రంలో రైతులు బండి సంజయ్‌ను అడ్డుకున్నారు. నిన్న నల్లగొండ జిల్లాలో రైతులపై దాడి చేసినందుకు బండి సంజయ్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.ధాన్యం కొనుగోళ్ల పై దమ్ముంటే కేంద్రంతో యాసంగి ధాన్యాన్ని కొంటామని ప్రకటన చేయించాలన్నారు. చివ్వెంల మండలం కేంద్రంలోని ఐకేపీ సెంటర్‌ వద్ద బండికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. కాగా బండి సంజయ్‌ తన పర్యటనకు అనుమతి తీసుకోలేదని నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా అనుమతి లేకుండా పర్యటన సరికాదన్నారు. అనుమతి లేకుండా పర్యటించారని సంజయ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. శాంతిభద్రతల దృష్ట్యా ఇరుపార్టీల నేతలపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img