Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రేవంత్‌కు సిట్‌ నోటీసు


హైదరాబాద్‌: టీఎస్‌సీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న ‘సిట్‌’ సోమవారం తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి నోటీసిచ్చింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ నివాసానికి చేరుకున్న సిట్‌ అధికారులు, జూబ్లీహిల్స్‌ పోలీసులు… రేవంత్‌ రెడ్డి అందుబాటులో లేకపో వడంతో ఆయన నివాసానికి నోటీసులు అతికించారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఇటీవల టీఎస్‌పీఎస్‌సి ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారం తెరపైకి వచ్చిన నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఒకే మండలంలో వంద మందికి ర్యాంకులు వచ్చా యని అన్నారు. దాంతో, రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు అందిం చాలని సిట్‌ అధికారులు నోటీసుల్లో కోరారు. కాగా నోటీసులపై రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ… సిట్‌ నోటీసులు తనకు ఇంకా అందలేదని అన్నారు. అయితే తన వద్ద ఉన్న ఆధారాలను సిట్‌ కు ఇవ్వబోనని, ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారాన్ని సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తే, తన వద్ద ఉన్న ఆధారాలను సిట్టింగ్‌ జడ్జికి అప్పగిస్తానని వెల్లడిరచారు. సిట్‌ నోటీసులు ఇస్తుందని ముందే ఊహించానని చెప్పారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్‌ కేసులో తనకు నోటీసులు ఇచ్చినట్టుగానే మంత్రి కేటీఆర్‌ కు కూడా నోటీసులు ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి చెప్పారు. టీఎస్‌పీఎస్‌సీ పరీక్షా ప్రశ్నాపత్రాలు సంతలో సరుకులా మారాయని ఆయన ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img