Friday, April 19, 2024
Friday, April 19, 2024

రేవంత్‌రెడ్డికి ఇవాళ సాయంత్రం వరకు గడువిస్తున్నా

: మల్లారెడ్డి
‘దమ్ముంటే ఎంపీ స్థానానికి రాజీనామా చేయ్‌..నేనూ చేస్తా..మల్కాజిగిరిలో ఇద్దరం పోటీచేద్దాం అంటూ కార్మికశాఖమంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ సాయంత్రం వరకు రేవంత్‌రెడ్డికి గడువు ఇస్తున్నానని, తన సవాల్‌ని స్వీకరించాలని అన్నారు. తన రాజీనామాకు కట్టుబడి ఉన్నానని స్పష్టంచేశారు.తాను సంపాదించిన ప్రతిరూపాయి తన కష్టార్జితమేనని అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నువ్వు అబద్ధాలు, బ్లాక్‌మెయిల్‌ వ్యవహారాల్లో నంబర్‌ వన్‌ కదా. గురువారం నేను నా మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. దమ్మూ ధైర్యం ఉంటే నువ్వు పీసీసీ చీఫ్‌, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తావా..’ అని సవాల్‌ విసిరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img