Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రైతుల ఆత్మగౌరవాన్ని పీయూష్‌ దెబ్బతీశారు

తక్షణమే క్షమాపణ చెప్పాలి : హరీష్‌రావు
దిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులను ఉద్దేశించి కేంద్రమంత్రి పీయూష్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా కాకుడా రాజకీయ నేతలా మాట్లాడారని అన్నారు. బుధవారం మంత్రి హరీశ్‌రాంఉ మీడియాతో మాట్లాడుతూ నిన్న పీయూష్‌ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.70 లక్షల రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్నారు.‘‘ నిన్ను కలవడానికి వచ్చిన మా బృందాన్ని ఎందుకొచ్చారు అని ప్రశ్నిస్తావా.. నీది రాజకీయం.. మాపై బురద చల్లుతున్నావ్‌.. మీ పార్టీ నాయకులను ముందు కలుస్తావా? లేక మా బృందాన్ని కలుస్తావా? 6 గురు మంత్రులు నిన్ను కలవడానికి వచ్చారు.. మా ప్రాధాన్యం రైతులు.. నీ ప్రాధాన్యం రాజకీయం.. ఇంత దుర్మార్గంగా మాట్లాడతావా.. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మా పార్టీ పుట్టుకునే తెలంగాణ ప్రయోజనాల కోసం, మా రాష్ట్రం, మా రైతులే ముఖ్యం. మాట మార్చారు.. నైతికత లేదు మీకు.. మోసం చేసింది మీరు, రైతులు చలిలో పడిగాపులు కాస్తున్నారు. 3 రోజులైనా మమ్మల్ని కలవలేదు.. మీ పార్టీ వాళ్ళను కలిసావు.. మమ్మల్ని కలవలేదని’’ హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img