Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతకైనా సిద్ధం : మంత్రి ఎర్రబెల్లి

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఫైర్‌ అయ్యారు. బుధవారం హన్మకొండలోని తన నివాసంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో నైనా రైతులు పండిరచిన మొత్తం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొంటున్నయా? అని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి ఫక్కీరు వేషాలు మానుకోవాలన్నారు. తొండి సంజయ్‌ మాటలకు విలువ లేదన్నారు. రైతుల ధాన్యాన్ని కేంద్రం ఎంత మేరకు కొంటుందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. సీఎం కేసీఆర్‌ కు కనీసం కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని అన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతకైనా సిద్ధంగా ఉందన్నారు.తెలంగాణ పట్ల కేంద్రం ప్రభుత్వం వివక్ష చూపుతుందని మండిపడ్డారు. ఢల్లీి మెడలు వంచేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అందరూ సహకరించాలన్నారు. తెలంగాణలో రైతులు వానాకాలంలో పండిరచిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం. రైతులు సంయమనం పాటించాలన్నారు. అలాగే భవిష్యత్తులో వానాకాలం, యాసంగిలో ఎంత పంటను తీసుకుంటారో కేంద్రం ముందే ప్రకటించాలి.దీనివల్ల రాష్ట్రంలో ఏ పంట వేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వీలుంటుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img