Friday, April 19, 2024
Friday, April 19, 2024

రైతుల సుదీర్ఘ పోరాటానికి విజయం

సురవరం సుధాకరరెడ్డి ప్రకటన

విశాలాంధ్ర`హైదరాబాద్‌ : రైతు వ్యతిరేక మూడు చట్టాలను ఉపసంహరించాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించడం రైతుల సుదీర్ఘ పోరాటానికి ఘన విజయంగా సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో జరిగిన 30 ఉప ఎన్నికలలో 15 స్థానాలలో బీజేపీి ఓడిపోయిన తర్వాత పెరిగిన పెట్రోల్‌, డిజీల్‌ ధరలు కొంచెం తగ్గించారు. పంజాబ్‌ ఎన్నికల కోసం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించబోతున్నారు. అయినా ఇది ప్రజాస్వామ్య విజయం. పట్టువదలని ప్రజాపోరాటాలు, బ్యాలెట్‌ పోరాటాలు కలిసి కార్పొరేట్‌ అనుకూల నియంతృత్వ ప్రభుత్వాలను నిలువరించగలవని రుజువైందని సురవరం పేర్కొన్నారు. అమరవీరులకు జోహార్లు అర్పించారు. రైతు యోధులకు అభివందనాలు తెలిపారు. లక్షలాది రైతుల శాంతియుత పోరాటాన్ని దెబ్బతీయటానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింందన్నారు. గణతంత్ర దినం నాడు మోసపూరిత చర్యలతో ఆందోళన హింసాత్మక రూపం దాల్చిందని ప్రజలను నమ్మించి, అణచివేసే కుట్ర విఫలమైందనీ, కాంట్రాక్టు ఫార్మింగ్‌, మండీల రద్దు, గిట్టుబాటు ధరకు ఇవ్వకపోవడం లాంటి రైతాంగ వ్యతిరేక చట్టాలు రైతుల మంచికోసమని, కాని కొంతమంది రైతులు దానికి అంగీకరించలేదని ప్రధాని మోదీ కల్లబొల్లి మాటలతో రైతులను మోసగించలేకపోయారన్నారు. ఈ ఉద్యమంలో, దాదాపు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినందుకు ప్రధాని దేశానికి క్షమాపణ చెప్పి మృతుల కుటుంబాలకు భారీ నష్టపరిహారం ప్రకటించాలని సురవరం డిమాండ్‌ చేశారు. చమురు ధరలు తగ్గించాలనీ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను ఆపాలనీ, కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img